గత కొన్నిరోజులుగా స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ ధరలు త్వరలో భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోల్ రేట్లు మరోసారి భారీగా పెరుగుతాయని డెలాయిట్ ఇండియా ఎల్ఎల్‌పీ అంచనా వేసింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నా.. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చమురు కంపెనీలు ధరలు…