సిద్దార్థ్ శుక్లా.. పునీత్ రాజ్‌కుమార్.. ఏపీ మంత్రి గౌతం రెడ్డి.. తాజాగా షేన్ వార్న్.. వీళ్లే కాదు ఇలా ఎందరో.. ఫిట్‌నెస్ కోసం శ్రమించి… ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్లే. అయితే.. వీళ్ల మరణాలు ఏం చెప్తున్నాయి? జిమ్ చేయడం తప్పా? అతిగా శ్రమిస్తే.. హార్ట్ ఎటాక్ తప్పదా? ఎక్సర్‌సైజ్ చేస్తే.. ఆరోగ్యానికి మంచిదంటారు. మరి వీళ్ల ప్రాణాల మీదకు ఎందుకొచ్చింది? ఫిట్‌గా ఉండేందుకు రకరకాలుగా శ్రమిస్తున్న ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్న సమస్య ఇదే. గుండె పదిలంగా…
శరీరం ఫిట్‌గా ఉండాలంటే ప్రతిరోజూ వాకింగ్ చేయడం తప్పనిసరి. అయితే ఏ సమయంలో వాకింగ్ చేయాలి? ఎంతసేపు చేయాలి అనేది చాలా మందికి తెలియదు. కొంతమంది ఫిట్‌గా ఉండాలని ఎక్కువసేపు వాకింగ్ చేస్తుంటారు. అలా చేయడం కూడా ప్రమాదకరమని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. మనం ఆకలి వేస్తే మన పొట్టకి ఎంత ఆహారం సరిపడితే అంత ఆహారం మాత్రమే తీసుకుంటాం. అలాగే వాకింగ్ కూడా అంతే. శరీరం తీరును బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాకింగ్ చేయాల్సి ఉంటుంది.…
ఫిట్‌నెస్ కోసం గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటారు. ఫిట్‌గా ఉండేందుకు వర్కౌట్ చేయడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, గంటల తరబడి వర్కౌట్ చేస్తే దాని ప్రభావం బెడ్‌రూమ్ పై పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కావాల్సిన దానికంటే ఎక్కువగా ఎక్సర్‌సైజ్‌లు చేస్తే శరీరంలో హార్మోన్స్ లెవల్స్ క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. Read: మారని పాక్ వైఖరి… ఇండియా విమానాలకు నో… ముఖ్యంగా తొడ కండరాలు బలంగా ఉండాలని, మజిల్స్ కనిపించాలని చెప్పి…
తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్టాలిన్ పేరు మారుమ్రోగిపోతున్నది. గతంలో స్టాలిన్ చెన్నై మేయర్‌గా పనిచేసిన రోజుల్లో చాలా ఉత్సాహంగా, ఫిట్‌గా కనిపించేవారు. నిత్యం ప్రజల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలపై చర్చించేవారు. ఆ తరువాత ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కూడా ఆయన తన దినచర్యలో ఎలాంటి మార్పులు చేయలేదు. నిత్యం యోగా, సైక్లింగ్, జిమ్ చేయడం తప్పనిసరి. 68 ఏళ్ల వయసులో స్టాలిన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన తన…
సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, బిజినెస్‌మెన్ రాజ్ కుంద్రాను అశ్లీల చిత్రాలు రూపొందిస్తున్న కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజ్ కుంద్రాతో పాటు ఈ కేసుకు సంబంధించిన పలువురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్ శిల్పా శెట్టిని కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారించారు. వ్యక్తిగతంగాను శిల్పా కెరీర్ పై ఈ ప్రభావం గట్టిగానే పడింది. ఇదిలావుంటే, తాజాగా శిల్పా ఓ ఈవెంట్ లో ఫిట్…
ఆనంద్ మహేంద్ర గురించి అందరికీ తెలుసు. వ్యాపారస్తుడిగా ఎంత సక్సెస్ అయ్యారో, సోషల్ మీడియాలో కూడా నిత్యం అందరికి ఉపయోగపడే పోస్టులు పెడుతూ యమా బిజీగా ఉంటున్నాడు. నిత్యం వ్యాయామాలు చేయడం ఆయన జీవనంలో ఒకభాగం. అయితే, ఆదివారం వచ్చిందని కొంతమంది వ్యాయామానికి బద్దకిస్తుంటారు. అలాంటి వారికోసం ఆనంద్ మహేంద్ర అదిరిపోయే చిట్కాను చెప్పాడు. ఆదివారం రోజున వ్యాయామం చేయకపోయినా, ఈ వీడియో చూస్తే సరిపోతుందని చమత్కరిస్తూ, సున్నితంగా హెచ్చరిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. …