తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్టాలిన్ పేరు మారుమ్రోగిపోతున్నది. గతంలో స్టాలిన్ చెన్నై మేయర్‌గా పనిచేసిన రోజుల్లో చాలా ఉత్సాహంగా, ఫిట్‌గా కనిపించేవారు. నిత్యం ప్రజల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలపై చర్చించేవారు. ఆ తరువాత ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కూడా ఆయన తన దినచర్యలో ఎలాంటి మార్పులు చేయలేదు. నిత్యం యోగా, సైక్లింగ్, జిమ్ చేయడం తప్పనిసరి. 68 ఏళ్ల వయసులో స్టాలిన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన తన ఫిట్‌నెస్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను ఏ మాత్రం పక్కనపెట్టడంలేదు. ప్రతిరోజూ కొంత సమయాన్ని జిమ్‌కోసం వినియోగిస్తారు. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తున్న ఫొటోలను డిఎంకే నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫిట్‌గా ఉంటేనే ప్రభుత్వం ఫిట్‌గా ఉంటుందని, ప్రజల్లోకి వెళ్లగలిగే సత్తా ఉంటుందని, ముఖ్యమంత్రిని చూసి చాలామంది ఇన్పైర్ అవుతున్నారని డిఎంకే నేతలు చెబుతున్నారు. సమయం దొరికినప్పుడల్లా స్టాలిన్ ఎంజీఎం డిజ్జీ వరల్డ్ నుంచి మమళ్లపురం వరకు 24 కిలోమీటర్లమేర సైక్లింగ్ చేస్తుంటారని డిఎంకే నేతలు చెబుతున్నారు.