BC Janardhan Reddy: మార్చి 2026కు ఫిషింగ్ హార్బర్‌ను పూర్తి చేస్తాం!
- మచిలీపట్నం ఫిషింగ్ హర్బర్ పనులను పర్యవేక్షించిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
- మార్చి 2026కు ఫిషింగ్ హార్బర్‌ను పూర్తి చేస్తాం
- ఇప్పటికే దాదాపు 57 శాతం పనులు పూర్తయ్యాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్చి 2026 నాటికి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పూర్తి చేయాలనే లక్ష్యంతో కాల పరిమితి పొడిగింపు చేశాం అని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ పనులు నిలిచిపోయాయని, హార్బర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో దాదాపు రూ.422 కోట్లతో నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే దాదాపు 57 శాతం పనులు పూర్తయ్యాయి కానీ కీలకమైన పనుల్లో జాప్యం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాతే ఫిషింగ్ హర్బర్ పనులు వేగంగా ముందుకు కదులుతున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు. మచిలీపట్నం ఫిషింగ్ హర్బర్ పనులను మంత్రులు బీసీ జనార్థన్ రెడ్డి, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ పర్యవేక్షించారు.
‘మార్చి 2026 నాటికి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పూర్తి చేయాలనే లక్ష్యంతో కాలపరిమితి పొడిగింపు చేశాం. గత ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ పనులు నిలిచిపోయాయి. ఫిషింగ్ హార్బర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో దాదాపు రూ.422 కోట్లతో నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపు 57 శాతం పనులు పూర్తయ్యాయి కానీ కీలకమైన పనుల్లో జాప్యం జరిగింది. మార్చి 2026 నాటికి ఫిషింగ్ హార్బర్‌ను పూర్తి చేయాలనే లక్ష్యంతో 2వ సారి కాలపరిమితి పొడిగింపు చేశాం. దాదాపు రూ.3500 కోట్లతో ఈ 9 ఫిషింగ్ హార్బర్లు అన్ని పూర్తి చేస్తున్నాం. ఫిషింగ్ హార్బర్ పూర్తయిన తర్వాత ఈ ప్రాంతాన్ని టూరిజం హాబ్‌గా తీర్చిదిద్దాలని మంత్రి కొల్లు రవీంద్ర కృషి చేస్తున్నారు’ అని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
‘కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాతే ఫిషింగ్ హర్బర్ పనులు వేగంగా ముందుకు కదులుతున్నాయి. పోర్టులు, ఫిషింగ్ హార్బర్‌ల పురోగతిపై మేము ప్రతీ నెలా సమీక్షలు చేస్తున్నాం. స్థానిక మంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. మార్చి 2026కు ఫిషింగ్ హార్బర్‌ను పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేస్తాం. సీ మౌత్ సమస్యపై టెక్నికల్‌గా పరిష్కరించేందుకు చెన్నైకి పంపించాం. అది వచ్చే 45 రోజుల్లో వస్తోంది, వచ్చిన తర్వాత సీ మౌత్‌ను కూడా పూర్తి చేస్తాం’ అని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!