భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. క్రీజులో షాద్ మాన్ ఇస్లాం (7), మోమినుల్ హక్ ఉన్నారు. కాగా.. రెండు వికెట్లను స్పిన్ మాయజాలం అశ్విన్ పడగొట్టాడు. బంగ్లాదేశ్ ప్రస్తుతం 26 పరుగుల వెనుకంజలో ఉంది. కాగా.. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉంది. రెండు, మూడో రోజు ఆట వర్షార్పణం కావడంతో మ్యాచ్ డ్రా అవుతుందని అనుకున్నారు.. కానీ ఇప్పుడు మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఐదవ రోజు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను వీలైనంత త్వరగా ముగించేందుకు భారత్ ప్రయత్నించాలి.
Bhatti Vikramarka : జపాన్‌లో భట్టి విక్రమార్క మూడు రోజుల పర్యటన ప్రారంభం
ఇంతకుముందు.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 285 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో.. టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్ (72), రోహిత్ శర్మ (23), శుభ్‌మన్ గిల్ (39), రిషబ్ పంత్ (9), విరాట్ కోహ్లీ (47), కేఎల్ రాహుల్ (68), రవీంద్ర జడేజా (8), అశ్విన్ (1), ఆకాశ్ దీప్ (12), బుమ్రా (1) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో మెహిదీ హాసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ ఇద్దరు చెరో 4 వికెట్లు పడగొట్టారు. హసన్ మమూద్ ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. ఈ ఇన్నింగ్స్‌లో దూకుడు ఇన్నింగ్స్ ఆడిన భారత్.. పలు రికార్డులు సాధించింది. అయితే.. 16 పరుగుల వ్యవధిలో భారత్ 4 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ అయింది.
Unstoppable: స్టార్ హీరోతో బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’..