దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చాందినీ చౌక్‌లోని మార్వాడీ కత్రాలో ఈరోజు సాయంత్రం భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో హుటాహుటిన 30 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. మరోవైపు.. ఇంత భారీ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసు బృందాలు కూడా ఘటనా స్థలంలో మోహరించారు.
పాట్నా-జార్ఖండ్ ప్యాసింజర్ రైల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీహార్‌లోని లఖిసరాయ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. స్టేషన్‌లో ఉండగానే రైలు తగలబడింది. రెండు రైలు కోచ్‌లు అగ్నికి ఆహాతి అయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా సెషన్స్ కోర్టు వెలుపల భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యాయవాదుల ఛాంబర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లాయర్లు అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
దక్షిణ బ్రెజిల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పోర్టో అలెగ్రే నగరంలో నిరాశ్రయులకు తాత్కాలిక ఆశ్రయం కోసం ఉపయోగిస్తున్న హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మరణించారని అధికారులు తెలిపారు.
Fire In Temple: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం జరిగింది. గర్భగుడిలో హోలీ రోజున జరిగే భస్మ హారతి సందర్భంగా గులాల్ ఊదడంతో మంటలు వ్యాపించడంతో పాటు 13 మంది కాలి బూడిదయ్యారు.
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 13 ఏళ్ల బాలిక మరణించింది. తన ప్రాణాలను కాపాడుకునేందుకు టార్పాలిన్ మీద దూకింది కానీ ఆమె బరువు కారణంగా ప్లాస్టిక్ టార్పాలిన్ చిరిగిపోవడంతో సీసీ రోడ్డు మీద పడిపోవడంతో బలంగా తలకు గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయింది.