దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకున్నాయి. దాదాపు 21 ఫైరింజన్లు మంటలను అదుపుచేస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Pooja Hegde:ఆఫర్స్ లేక అలాంటి పాత్రలు చెయ్యడానికి రెడీ అవుతున్న పూజా హెగ్డే..
ఆస్తి, ప్రాణ నష్టాలు ఏమైనా జరిగాయన్న విషయంపై ఎలాంటి సమాచారం లేదు. సంఘటనాస్థలికి పోలీసులు, అధికారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పరిస్థితుల్ని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: BRS: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్..
#WATCH | Fire breaks out at CR building located at ITO in Delhi; 21 fire engines present at the spot pic.twitter.com/SDc3EqJnb0
— ANI (@ANI) May 14, 2024