పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. అమృత్‌సర్-సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రైలును ఆపడానికి ఒక ప్రయాణీకుడు గొలుసు లాగాడు. దీంతో ట్రైన్ ఆగడంతో వెంటనే ప్రయాణికులంతా కోచ్ నుంచి సురక్షితంగా బయటకు దిగేశారు. ఈ క్రమంలో పలువురి ప్రయాణికులకు స్వల్పగాయాలు అయినట్లు అధికారి తెలిపారు.
హైదరాబాద్ పాత బస్తీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బేగంబజార్ లోని మహారాజ్ గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో భారీగా మంటలు వ్యాపించాయి. మంటల్లో దాదాపు 10 మంది చిక్కుకున్నట్లు సమాచారం. మంటలు దట్టంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. Also Read:Kohli-Rohit: కోహ్లీ-రోహిత్ ముందే వీడ్కోలు పలికారా?.. 50…
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని్ప్రమాదం సంభవించింది. కేశవ్ పురం ప్రాంతంలోని లారెన్స్ రోడ్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సమీపంలోని ఒక కర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇక సమీప నివాసాల దగ్గర దట్టంగా పొగ కమ్ముకుంది.
చట్టం తెలిసివాళ్లే.. చట్టాన్ని మీరితే ఇంకేమీ న్యాయం జరుగుతుంది. ఉన్నతమైన స్థానంలో కూర్చుని తీర్పులు చెప్పే న్యాయమూర్తులే గాడి తప్పుతున్నారు. న్యాయశాఖకే మచ్చ తెచ్చిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కిషన్ బాగ్ కార్పోరేటర్, కాలాపత్తర్ ఇన్స్‌పెక్టర్, బహదూర్ పురా పోలీసులు వెంటనే స్పందించారు. కిషన్‌బాగ్ ఎక్స్ రోడ్డు సమీపంలోని ఓ బిల్డింగు సెల్లార్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అది కాస్త పైపునకు పాకింది. అగ్ని ప్రమాదం వల్ల భవనంపై అంతస్తు్ల్లోనూ దట్టమైన పొగ అలుముకుంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. రాష్ట్రంలోని చంద్గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివాజీ పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే.. రాత్రి శివాజీ పాటిల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటిల్ గాయపడ్డారు. ఊరేగింపులో పాల్గొన్న కొందరు మహిళలు కూడా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మహాగావ్లో శివాజీ పాటిల్ విజయం సాధించిన తర్వాత కొందరు మహిళలు ఆయనకు హారతి ఇస్తుండగా ఈ ఘటన జరిగింది.
మహారాష్ట్రలోని ముంబైలోని చెంబూర్ రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్టేషన్ వెలువల భారీగా ప్రజలు గుమిగూడారు.