దక్షిణ బ్రెజిల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పోర్టో అలెగ్రే నగరంలో నిరాశ్రయులకు తాత్కాలిక ఆశ్రయం కోసం ఉపయోగిస్తున్న హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మరణించారని అధికారులు తెలిపారు. మరో 13 మంది గాయపడ్డారు. ఈ హోటల్ అనుమతి లేకుండా పనిచేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలికి చేరుకుని అగ్నిప్రమాదానికి గల కారణాలను పరిశోధిస్తున్నారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇది కూడా చదవండి: SABARI: ‘అనగనగా ఒక కథలా’ తల్లికి బిడ్డే ప్రపంచం అని చెప్పే గీతమిది చంద్రబోస్..
మరోవైపు మంటల నుంచి రక్షించబడిన 13 మందిలో ఎనిమిది మంది ఇంకా ఆసుపత్రిలో ఉన్నారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది. ఎందుకు అంత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయనే విషయం తెలియాల్సి ఉంది. పోర్టో అలెగ్రేలో మరో 22 చిన్న హోటళ్లను కలిగి ఉన్న గరోవా గ్రూప్‌లో గరోవా ఫ్లోరెస్టా హోటల్ కూడా ఒక భాగం. 2022లో దానిలోని మరొక హోటల్లో కూడా మంటలు చెలరేగాయి. నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పించడానికి 400 గదులను ఉపయోగించేందుకు 2020లో ఈ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: KCR: సోషల్ మీడియాలో అడుగుపెట్టిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్..
ఈ ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్ ఎడ్వర్డో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 2 గంటలకు మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరిగినట్లుగా సమాచారం అందిందని తెలిపారు. ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు చెప్పారు. ఐదు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయని చెప్పారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇక పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు మేయర్ సెబాస్టియో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Haryana : రూ.200తల్లిని అడిగాడని.. అన్నను కత్తితో పొడిచిన తమ్ముడు