ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని విశాల్ మెగా మార్ట్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం 6:47 గంటలకు అగ్నిప్రమాదం గురించి తమకు కాల్ వచ్చిందని, మంటలను అదుపు చేయడానికి 13 అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి పంపినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ తెలిపింది
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఆలయం ముందు భాగంలో ఉన్న ఓ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఆలయం ముందురున్న చలువ పందిళ్లు అంటుకున్నాయి. మంటలను చూసి భయంతో ఆలయ సమీపంలోని లాడ్జ్ నుండి భక్తులు బయటి వచ్చి పరుగులు తీశారు. స్థానికులు భారీ మంటలను చూసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. Also Read: Schools Bandh: అలర్ట్.. నేడు ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్! ఫైర్…
Reactor Blast: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ పేలుడు ధాటికి పరిశ్రమ తునాతునకలైంది. ఇప్పటివరకు 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో 10 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. Read Also:Kubera : పదేళ్లకే…
Patancheru : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సీగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ పేలుడు సంభవించడంతో పరిశ్రమ తునాతునకలైపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉదయం 9 గంటల సమయంలో సీగాచి కెమికల్స్‌లో పని సాగుతున్న సమయంలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి కంపెనీ…
Tirumala: తిరుమలలోని జీఎన్సీ టోల్ గెట్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఘట్ రోడ్డులో ప్రయాణం అనంతరం తిరుమలకు చేరుకోగానే దట్టమైన పొగతో మంటలు వ్యాపించాయి. క్షణాల వ్యవధిలో కారు మొత్తం మంటలు వ్యాపించాయి. భక్తులు కారు ఆపి భయటకు పరుగులు పెట్టారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.
Fire Breaks Out: ముంబైలోని ఫిల్మ్ సిటీలో సోమవారం ఉదయం ఓ సీరియల్ సెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదిక లేదని వారు తెలిపారు. అనుపమాలోని టెంట్ ప్రాంతంలో మంటలు చెలరేగాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక దళానికి సమాచారం అందింది. దానితో వెంటనే గోరేగావ్ (తూర్పు) ప్రాంతం లో ఉన్న ఫిల్మ్ సిటీలోని దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనగరిలో ఉన్న మరాఠీ…
Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ద్వారకలోని శబ్ద్ అపార్ట్మెంట్లో ఈ రోజు (జూన్ 10న) ఉదయం 10 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Gulzar House Incident: గుల్జార్ హౌస్ బాధితుల ఆరోపణలపై అగ్నిమాపక శాఖ స్పందించింది. ఈ సందర్భంగా ఫైర్ డీఎఫ్ఓ వెంకన్న మాట్లాడుతూ.. మాకు ఫోన్ కాల్ వచ్చిన ఒకటిన్నర నిమిషంలో సంఘటన స్థలానికి చేరుకున్నాం.. ఫైర్ ఇంజన్లో పూర్తిస్థాయి అధునాతన పరికరాలు ఉన్నాయి.
Ponnam Prabhakar : హైదరాబాద్ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో గుల్జార్ హౌజ్ వద్ద ఈ నెల 18న జరిగిన అగ్ని ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు, ఆరుగురు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, ప్రభుత్వ చర్యలపై స్పష్టతనిచ్చారు. ఈ విచారణ కమిటీకి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ…
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం భారీ నష్టా్న్ని మిగిల్చింది. తాజాగా గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద కారణాలను అధికారులు గుర్తించారు. అగ్నిప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని తేల్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలిపోవడంతో ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను నడుపుతుండటంతో ఘటన జరిగింది.