Chennai: గూడ్స్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పలు రైళ్లు నిలిపివేత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai: చెన్నై తిరువళ్లూరు సమీపంలో ఇంధనంతో వెళ్తున్న సరుకు రవాణా ( గూడ్స్) రైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోర్టు నుండి చమురుతో వెళ్తున్న సరుకు రవాణా రైలులో అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో మంటలు చెలరేగాయని సమాచారం. ఎగసిపడుతున్న మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కప్పబడి ఉంది. రైలులో ఇంధనం ఉన్నందున మంటలు మరింత వ్యాపిస్తాయని ఆందోళన చెందుతున్నారు అధికారులు.
Read Also:Kota Srinivasa Rao: సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.. దిగ్భ్రాంతిలో టాలీవుడ్
Also Read
అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, వెంటనే భారీ ఎత్తున చేరుకొని మంటలను ఆర్పడానికి చాలా కష్టపడుతోంది. మంటలను ఆర్పడానికి 10కి పైగా అగ్నిమాపక యంత్రాలతో మోహరించారు. మంటల కారణంగా అరక్కోణం మీదుగా వచ్చిన సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వివిధ ప్రదేశాలలో నిలిపివేశారు. అలాగే, ఉదయం 5.50 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ వందే భారత్ రైలును చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ శతాబ్ది రైలును కూడా నిలిపివేశారు.
Read Also:Girls For Sale: ఐదో సంతానంగా ఆడపిల్ల.. అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులు
దీని ప్రకారం చెన్నై సెంట్రల్ నుండి కర్ణాటక, వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లను నిలిపివేశారు. దీనితో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురివుతున్నారు. తెల్లవారుజామున రైలులో జరిగిన అగ్ని ప్రమాదం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
-
OTR: తెలంగాణలో భారీ ఎత్తున డబుల్ శాలరీ స్కామ్
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!