ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని విశాల్ మెగా మార్ట్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం 6:47 గంటలకు అగ్నిప్రమాదం గురించి తమకు కాల్ వచ్చిందని, మంటలను అదుపు చేయడానికి 13 అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి పంపినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ తెలిపింది. “కరోల్ బాగ్‌లోని విశాల్ మెగా మార్ట్‌లో మంటలు చెలరేగాయి. 15 అగ్నిమాపక యంత్రాలను పంపించారు. సాయంత్రం 6.47 గంటలకు ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు కాల్ అందింది” అని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.
READ MORE: IND vs ENG: సెంచరీలతో చెలరేగిన బ్రూక్, స్మిత్.. తేలిపోయిన భారత బౌలర్లు..!