Indore: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లోని జూన్ థానా పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఒక ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా, కుటుంబంలోని మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం ప్రకారం.. శహజాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఆ ఇంట్లో నివసిస్తున్నారు. అదే ఇంట్లో అతను ఒక చిన్న గోదాం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే గత రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కొద్ది సేపట్లోనే మంటలు ఇంటి అంతా వ్యాపించాయి. మెట్నాల కారణంగా వచ్చిన దట్టమైన పొగతో కుటుంబ సభ్యులు ఇంట్లోనే చిక్కుకున్నారు.
Temple employees: పండగ పూట ఇలాంటి గిప్ట్ ఇచ్చారేంట్రా బాబు..
ఈ విషయం గమనించిన పొరుగు వారు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో శహజాద్, అతని భార్య, ఇద్దరు కుమారులు ఇంకా వారి కుమార్తెను బయటకు తీశారు. వారందరినీ వెంటనే బాంబే ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరిశీలన తర్వాత శహజాద్ 11 ఏళ్ల కుమారుడు రహ్మాన్ మృతిచెందినట్లు తెలిపారు. మిగతా వారు శహజాద్, అతని భార్య, మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా కాలిపోయి వేంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం శహజాద్ పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర ఆవేదన కలిగించింది. కుటుంబానికి సహాయం అందించాలని ప్రజలు, స్థానిక నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి, షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు.
Daily Horoscope: ఆదివారం దినఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అనుకూలమే!