మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఈరోజు జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఈ మంటల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 4 గంటలకు టైలరింగ్ షాపులో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంలో విజయం సాధించగా., అయితే అప్పటికి మంటల్లో ఏడుగురు మరణించారు.
Also read: Harirama Jogaiah: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధినాయకులకో విజ్ఞప్తి అంటూ.. హరిరామ జోగయ్య లేఖ!
ఆలం టైలర్స్ షాపులో మంటలు చెలరేగాయని సంభాజీ నగర్ పోలీస్ కమిషనర్ మనోజ్ లోహియా తెలిపారు స్థానికులు. బాధితులు భవనం యొక్క పై అంతస్తులలో నివసిస్తున్నారు. మంటలు ఆ నివాస స్థలాలకు చేరుకోకపోగా, పొగ పీల్చడం వల్ల బాధితులు మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 4.15 గంటలకు ఘటన గురించి పోలీసులకు తెలిపారు అక్కడి స్థానికులు.
Also read: Kejriwal: కేజ్రీవాల్కు ఆనారోగ్యం.. 4.5 కేజీల బరువు తగ్గిన ఢిల్లీ సీఎం
అయితే మంటలు చెలరేగడంతో, దుకాణం పైన ఒక కుటుంబం నివసిస్తున్న మొదటి అంతస్తులోకి పొగలు వ్యాపించాయి. దాంతో ఊపిరాడక ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పోలీసు కమిషనర్ మనోజ్ లోహియా విలేకరులకు తెలిపారు. ఇంకా ఈ విషయం ఫై ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాధితులకు పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించారు.