మూసీ నిర్వాసితులకు ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మూసీ నిర్వాసితుల కోసం 37 కోట్ల 50 లక్షలు విడుదల చేసింది. మూసీ నుంచి ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్న వారికి ఖర్చుల కోసం రూ. 25 వేలు ఇస్తుంది. 15 వేల కుటుంబాలకు రూ.25 వేల చొప్పున నగదు అందజేస్తోంది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు నిధులు జారీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నిర్వాసితులు ఇండ్లు…
Ponnam Prabhakar : ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవారికి ఇళ్లు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంతకు ముందు ప్రభుత్వం రేషన్ కార్డులే ఇవ్వలేదన్నారు. మేము పేదల అందరికీ పథకాలు అందేలా చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఇందిరమ్మ పేరు ఉంటే డబ్బులు ఇవ్వం అంటున్నారని, మీ జేబులో నుండి ఇస్తున్నారా..? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు.…
Uttam Kumar Reddy: చొప్పదండి నియోజకవర్గం నారాయణపూర్ గ్రామంలో జరిగిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేశారు. నారాయణపూర్ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ఆయన, ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం రూ. 80 కోట్లు ఖర్చు చేసి, నీటిని ఆయకట్టుకు అందజేయాలని ప్రభుత్వ ప్రణాళిక ఉందన్నారు.…
దేశ రాజధాని ఢిల్లీలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ప్రధాన పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా ఢీకొంటున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆప్.. పలు ప్రజాకర్షక పథకాలను ప్రకటించింది.
CM Revanth Reddy : యూపీఎస్సీ మెయిన్స్ 2024 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది తొలి సారిగా రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. సివిల్స్ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ఈ ఏడాది తొలిసారిగా అమలు చేసింది. సింగరేణి సంస్థ అధ్వర్యంలో 135 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం…
కోటి మంది మహిళలను ఆర్థికంగా బలంగా చేయడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ప్రతి మహిళను స్వయం సహాయ సంఘాల్లో చేర్చే దిశగా అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.
గిరిజన బాలిక సాయిశ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. కుమురం భీం జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ.. ఎంబీబీఎస్ లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది.
హైడ్రా కూల్చివేతల భయం కారణంగా కూకట్ పల్లిలో ప్రాణాలు కోల్పోయిన బుచ్చమ్మ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అర్థం, పర్థం లేకుండా ఆనాలోచితంగా గుడ్డెద్దు చేలో పడినట్లు ఇష్టమొచ్చినట్లు కూకట్ పల్లిలోని నల్ల చెరువు వద్ద కూల్చివేతలు చేశారని ఆయన ఆరోపించారు. హైడ్రా అనే బ్లాక్ మెయిల్ సంస్థను పేదల మీదకు ఉసిగొల్పి…నోటీసులు ఇవ్వకుండానే మీ ఇళ్లు కూలగొడుతామంటూ భయానక వాతావారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందని,…
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొని, రోడ్డు ప్రమాదంలో గాయపడిన సెబ్ కానిస్టేబుల్ మొరు నాగరాజుకు రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు.
వర్షాలు, వరదలతో భారీ నష్టాన్ని చవి చూసిన తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించినట్టు వార్తలు గుప్పుమన్నాయి.. వరద సాయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్ల నిధులు విడుదల చేసినట్టు ప్రచారం జరిగింది.. అయితే, ఈ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. కేంద్రం సాయం చేసింది అనే వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.