కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులు మహమ్మారి బారినపడ్డారు.. ఇక, వందలాది మంది ప్రాణాలు వదిలారు.. అయితే, తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం ఎంకే స్టాలిన్.. కరోనాతో ఎవరైనా గుర్తింపు పొందిన జర్నలిస్టు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.. అంతేకాదు.. కరోనా సమయంలో.. జర్నలిస్టులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.2000 నుంచి రూ.5 వేలకు పెంచారు..…
రెండేళ్లపాలన కూడా పూర్తికాకముందే వరుసగా మూడో ఏడాది మత్స్యకార భరోసా అమలు చేస్తున్నాం అని సీఎం జగన్ తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వానికి ఉన్న కష్టం కన్నా సామాన్యుడికి ఉన్న కష్టం పెద్దది. నేరుగా వారి అక్కౌంట్లోకి సుమారు రూ.120 కోట్లు పంపుతున్నాం. ఒకవైపు కోవిడ్, మరోవైపు వేట నిషేధ సమయంలో ఈ 1.2 లక్షల కుటుంబాలకు రూ.10వేల చొప్పున సహాయం వారికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.10వేల…
కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌తో ప్రైవేట్ స్కూళ్లు మూతపడడంతో.. ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు నెలకు రూ. 2000లు, కుటుంబానికి 25 కిలోల బియ్యం చొప్పొన అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. అయితే ప్రభుత్వమందించే ఈ ఆపత్కాలపు ఆసరాకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. మొత్తం 1,18,004…