ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం… పట్టణాల అభివృద్ధి కోసం రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సహాయం ప్రకటించింది… ఈ విడతలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రలోని పట్టణ స్థానిక సంస్థల విభాగం కింద కేంద్రం ఆర్ధిక సహాయం చేసింది… ఆంధ్రప్రదేశ్‌కి తాజాగా రూ.136 కోట్లు విడుదల చేసింది కేంద్రం.. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం అభివృద్ధి కోసం కేంద్ర ఈ సహాయం చేసింది… 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటి వరకు…
GST revenue collections: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్‌టీ) అమలు ప్రారంభమయ్యాక గత నెల(జులై)లో రెండో అత్యధిక వసూళ్ల రికార్డు నమోదైంది. రూ.1,48,995 కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది. 2021 జూలై నెలతో పోల్చితే ఇది 28 శాతం ఎక్కువ కావటం విశేషం.
ఏపీ జనగ్ సర్కార్ కు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇవాళ రెవెన్యూ లోటు కింద కేంద్రం రూ.879.08 కోట్లు విడుదల చేసింది. అయితే.. నిధుల పంపిణీ తర్వాత లోటు ఏర్పడిన రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈనేపథ్యంలో.. ఆర్థిక సంవత్సరం 2022, 2023లో రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద రూ.10,549 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేయగా, ఇప్పటి వరకు కేంద్రం రూ.3,516.33 కోట్లు…
ఇకపై విమానాల్లో ప్రయాణించాలనుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్తగా కొన్ని నిబంధనలను తీసుకువచ్చింది. అనవసర ఖర్చులను తగ్గించేందుకు ఈ నియమాలను రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగులు విమానాల్లో ట్రావెల్ క్లాసులో అతితక్కువ ధర ఉన్న టికెట్ క్లాస్ నే ఎంచుకోవాలని.. పర్యటనలు, ఎల్టీసీ కోసం వెళ్లే వారు మూడు వారాల కన్నా ముందుగా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. ఉద్యోగులు తమ ప్రయాణానికి ఒక్కో టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలని,…
బ్యాంక్ ఖాతాల నిర్వహణపై ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ఆర్థిక శాఖ… ఇకపై కొత్త ఖాతా ఓపెన్ చేయాలి అంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది… ప్రతి నెల బ్యాంకు ఖాతాలను వెరిఫై చేయాలి.. డీటెయిల్స్‌ని 10వ తేదీలోపు ఫైనాన్స్ శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. ఇక, అవసరం లేని బ్యాంక్ అకౌంట్స్ ని వెంటనే క్లోజ్ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది ఆర్థికశాఖ.. మార్చి…
జీఎస్టీ రేట్లను రేషనలైజ్ చేయాలంటూ చాలా రోజులుగా ప్రజలను నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. వ్యాపారవర్గాలు కూడా ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరుతూనే ఉన్నాయి. అలాంటివారందరికీ కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ తీపి కబురు చెప్పారు. ప్రభుత్వ అజెండాలో జీఎస్టీ రేట్ల రేషనలైజేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐదు శ్లాబ్స్‌లో ఉన్న జీఎస్టీ రేట్లను మూడు స్లాబ్స్‌కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీలో మూడు రేట్ల వ్యవస్థ చాలా…
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కుప్పకూలిన, ఆర్ధిక మోసాలకు గురైన బ్యాంకు డిపాజిటర్లకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకున్నది. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ చట్టంలో సవరణలను క్లియర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. డిపాజిటర్లకు వారి మొత్తం డిపాజిట్లపై రూ. 5 లక్షల భీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభావిత బ్యాంక్ తాత్కాలిక నిషేదానికి గురైన 90 రోజుల్లో ఈ భీమా లభిస్తుంది. దివాలా తీసిన బ్యాంకులపై ఆర్బీఐ తాత్కాలిక నిషేదం విధించిన తరువాత…
కరోనా సమయంలోనూ వరుసగా లక్ష కోట్లను దాటుతూ వచ్చిన జీఎస్టీ వసూళ్లు ఈ సారి పడిపోయాయి.. 8 నెలల తర్వాత జూన్‌లో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయల దిగువకు చేరాయి.. తాజా గణాంకాల ప్రకారం జీఎస్టీ గత నెలలో రూ. 92,849 కోట్లు వసూలైంది.. ఇందులో సీజీఎస్టీ రూ. 16,424 కోట్లు కాగా.. ఎస్‌జీఎస్టీ రూ. 20,397 కోట్లుగా ఉంది.. ఇక, ఐజీఎస్టీ రూ. 49,079 కోట్లు, వస్తువుల దిగుమతులపై రూ. 25,762 కోట్లు.. వస్తువుల…
ఓవైపు కరానో విలయం సృష్టించింది.. మహమ్మారి, లాక్‌డౌన్ దెబ్బతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికపోయాయి.. చిన్న చిన్న సంస్థ మూతబడ్డాయి.. పెద్ద సంస్థలు కూడా భారీగా నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి.. క్రమంగా ఆ భారం ఉద్యోగాలు, ఉపాధిపై కూడా పడింది.. అయితే, ఇదే సమయంలో.. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము భారీగా పెరిగిపోయిందనే వార్తలు వచ్చాయి.. స్విస్ బ్యాంకుల్లో 2019 చివరి నాటికి రూ. 6,625 కోట్లు (సీహెచ్ఎఫ్ 899 మిలియన్)గా ఉన్న భారతీయుల సొమ్ము 2020…