ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు, రచయిత, దర్శకుడు కత్తి మహేశ్ చెన్నైలో కన్నుమూశారు. కొద్దికాలం క్రితం నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానిక హాస్పిటల్ లో చేర్చి ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం బంధువులు చెన్నయ్ లో అపోలో హాస్పిటల్ కు తరలించారు. అక్కడే కంటికి, తల భాగానికి శస్త్ర చికిత్స చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి తొలి నుంచి సేవలు అందిస్తున్న కత్తి మహేశ్ కు ఆంధ్ర…
సినీ విశ్లేషకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మొదట స్వల్పగాయాలు అయ్యాయని సమాచారం అందగా.. ఫోటోలు వైరల్ కావడంతో తీవ్రంగానే గాయపడ్డట్లు తెలిసింది. కత్తి మహేశ్ తల, కంటి భాగాలకు తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరే సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో వెంటిలేటర్‌పై పెట్టామన్నారు.…