Loksabha Elections : లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌కు సంబంధించిన తుది గణాంకాలు వెలువడ్డాయి. మంగళవారం రాత్రి ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
దేశంలో ఐదవ దశ లోక్‌సభ ఎన్నికలు కాసేపటి క్రితమే ముగిశాయి. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ కొనసాగింది. అయితే.. ఉత్తర ప్రదేశ్ లోని రెండు గ్రామాలు, జార్ఖండ్‌లో ఒక గ్రామ ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. దీనికి కారణమేంటని ఆరా తీయగా.. తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేదని.. అందుకే తాము ఓటు వేయడం లేదని తెలుపుతున్నారు. తమ గ్రామ అభివృద్ధి గురించి పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం…
దేశ వ్యాప్తంగా ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత రాష్ట్రాల్లో 49 స్థానాలకు ఓటింగ్ ముగిసింది.
దేశంలో రేపు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్ జరుగనుంది. అందుకోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్‌లోని 14, మహారాష్ట్రలోని 13 స్థానాల్లో అత్యధికంగా ఓటింగ్ జరుగుతోంది. ఒడిశాలో 5, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో ఒకటి, లడఖ్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది.
రేపు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పలు రాష్ట్రాల్లో ఐదో దశ ఓటింగ్ జరుగనుంది. అందుకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా.. ఐదో విడత పోలింగ్‌కు ముందు ఓటర్లకు ఈసీ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొని ఓటు వేయాలని కోరింది. ముఖ్యంగా పట్టణ ప్రజలకు ఎన్నికల సంఘం ప్రత్యేక అభ్యర్థన చేసింది. ముంబై, థానే, లక్నో వంటి నగరాల్లో గత ఎన్నికల్లో ఓటింగ్ పట్ల తేడా కనిపించిందని కమిషన్ చెబుతోంది.