తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఐదో తరగతి విద్యార్థిని ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన గుర్రం మేఘన (9) ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది. ఆమెకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె తల్లిదండ్రులు డ్రాయింగ్ నేర్చుకోవడానికి మేఘనను ప్రోత్సహించారు. అయితే మేఘనకు సీఎం కేసీఆర్ కూడా ఇష్టం ఉండటంతో సుమారు 100కు పైగా చిత్రాలను వివిధ రంగులతో డ్రాయింగ్ వేసి అందరినీ అబ్బురపరుస్తోంది. కేవలం హరితహారం పథకం గురించే…