తెలంగాణ రైతాంగానికి ఉద్దేశించి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ విడుదల చేశారు. యూరియా కేటాయింపులు, స్వదేశీ–దిగుమతి సరఫరాల్లో కేంద్ర ప్రభుత్వం సమన్వయ లోపం, అసమర్థత కారణంగా రాష్ట్రాలకు అవసరమైన పరిమాణం సమయానికి చేరడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.
Minister Atchannaidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. 2025 ఖరీఫ్ కోసం 31.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశామని.. అందులో ఇప్పటివరకు 21.34 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని ఆయన తాజాగా విలేకర్ల సమావేశంలో అన్నారు. యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ, కాంప్లెక్స్ కలిపి 6.22 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని.. ఎరువుల కొరత రాకుండా…
Ponnam Prabhakar : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల కొరతపై బీజేపీ చేస్తున్న విమర్శలు నిరాధారమని, “ఎరువులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయనే విషయం కూడా రామచంద్రరావుకి తెలియదా?” అంటూ మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలు, ఎరువులు ఎక్కడి నుండి వస్తాయో కూడా రామచంద్రరావుకి అర్థం కావడం లేదు. మిగతా విత్తనాలు,…
Minister Thummala: తెలంగాణలో ఖమ్మం జిల్లాతో సహా పలు ప్రాంతాల్లో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.