ఫెంగల్ తుఫాను తమిళనాడులో పెను విధ్వంసం సృష్టించింది. తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తిరువణ్ణామలై, విల్లుపురం, పుదుచ్చేరి వరదలతో అతలాకుతలమయ్యాయి. తిరువణ్ణామలైలో పలు ఇళ్ళుపై కొండ చరియలు విరిగి పడ్డాయి. 25 మంది పెద్దవారు, ఐదుగురు పిల్లలు వరకు కొండచరియలు కింద ఇరుక్కు పోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫెంగల్’ తుపాన్ పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో తీరం దాటినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. తుపాన్ పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ.. క్రమంగా బలహీన పడనుంది. తుపాన్ ప్రభావంతో ఈరోజు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర అంతటా వర్షాలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తుఫాన్ వల్ల…
ఫెంగల్ తుఫాన్ తీరాన్ని తాకింది.. పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకినట్టు ఐఎండీ ప్రకటించింది.. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తుఫాన్ తీరం తాకిన తర్వాత.. మహాబలిపురం-కరైకల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది.. దాదాపు 4 గంటల్లో తీరం దాటే ప్రక్రియ పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.. ఇక, ఈ రోజు రాత్రి 11.30 గంటల సమయానికి.. తీవ్ర వాయుగుండంగా…