CM Chandrababu: రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కృష్ణా జిల్లా పర్యటనలో ఆయన రైతుభరోసా కేంద్రం ప్రారంభించారు.. అనంతరం రైసు మిల్లును కూడా పరిశీలించి, ధాన్యం సేకరణపై రైతులతో మాట్లాడారు.. అక్కడ రైతులకు టెక్నాలజీపై ఉన్న అనుభవం అడిగి తెలుసుకున్నారు.. ఫోన్ లో మెసేజ్ లు చదవడం పై రైతుల అవగాహన ఏ పాటిదో అడిగి తెలుసుకున్నారు.. ధాన్యం సేకరణపైన ప్రత్యేక దృష్టి సారించారు.. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు, తేమశాతంలో కచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగితే రైతులకు శ్రమ తగ్గడంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. పెట్టుబడి తగ్గించి రైతులను ఆప్పుల ఊబి నుండి బయటకు తీసుకొచ్చి ఉపశమనం కలిగించడంతో పాటు ఆదాయం పెంచాలన్నదే తమ సంకల్పమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
Read Also: TTD: శ్రీవారి భక్తులకు గమనిక.. మార్చి నెల దర్శన టికెట్ల విడుదల తేదీల మార్పు..
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, గంగూరు రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును పరిశీలించారు ఏపీ సీఎం… రైతుల నుంచి ధాన్య సేకరణ ఎలా చేస్తున్నారో సీఎంకు రైతు సేవాకేంద్రం సిబ్బంది వివరించారు. అనంతరం తాము ధాన్యం ఎలా అమ్ముతున్నది రైతులు తెలిపారు.. గతేడాది కంటే ఈ ఏడాది పంట ఎక్కువగా వచ్చిందని, మిషన్ కోత వల్ల ఎకరానికి అయిదారు వేలు కలిసి వచ్చిందని రైతులు చెప్పారు. కోసిన గడ్డిని బయోఫ్యూయల్ ప్లాంట్ వాళ్లు తీసుకుంటే మరో రూ.5 వేల వరకూ వస్తుందని రైతులకు సీఎం తెలిపారు. ధాన్యం కొన్న 48 గంటల్లోనే డబ్బులు జమ అవుతున్నాయా అని చంద్రబాబు అడగ్గా… డబ్బులు కరెక్టుగానే వస్తున్నాయని రైతులు సమాధానమిచ్చారు. ప్రోక్యూర్మెంట్‌కు షెడ్యూలింగ్ మొత్తం ఒకటిగా లేదా.. వేర్వేరుగా పంట కోత కోస్తే పార్ట్ షెడ్యూలింగ్ ఇస్తామనిసేవాకేంద్రం సిబ్బంది వివరించారు. సాగు చేస్తున్న పొలాన్ని బట్టి రైతుకు దిగుబడి ఎంత వస్తుందో కూడా నమోదు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. అనంతరం ధాన్యం తేమశాతాన్ని ఎలా గణిస్తారో స్వయంగా సీఎం చంద్రబాబు పరిశీలించారు. తేమశాతంలో సేవాకేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లులో కూడా అంతే రావాలని, మార్పు వస్తే చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు.
Read Also: Barabar Premistha: ‘బరాబర్ ప్రేమిస్తా’నంటున్న ఆటిట్యూడ్ స్టార్
ఇక, అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. రైస్ ప్రొసీజర్ చూశా.. మిల్లులలో ఎలాంటి విధానాలు ఉన్నాయో తెలుసుకున్నానని అన్నారు.. గత సంవత్సరం 12.51 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు, ఈ సంవత్సరం 21.433 లక్షల మెట్రిక్ టన్నులు సంస్థ సేకరించాం అని తెలిపారు.. 3.13 లక్షల మందికి 4850 కోట్లు 48 గంటల్లోనే ఇచ్చామని తెలిపారు.. డిబిటి ద్వారా రైతులకు ఇవ్వడంలో ఎలాంటి విధానం అమలు చేస్తే మంచిదో నిర్ణయిస్తామని వెల్లడించారు.. NPCIL ద్వారా ఆటోమేషన్ చేయగలమా, రెండు గంటల్లో బ్యాంకుకు వెళ్ళేలోగా వారి ఖాతాల్లో డబ్బుండేలా చేయాలని చూస్తున్నామన్నారు.. తేమ పరీక్షల్లో స్టాండర్డైజేషన్ చేయాలని అధికారులకు చెప్పామని, ప్రధాన సమస్యగా తేమ శాతం కనిపించిందని సీఎం అన్నారు.. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. సైలోజ్ రైతు దగ్గరే ఉంటే ధర పెరిగినపుడు అమ్ముకుంటాడు రైతు.. సైలోజ్ కూడా అందించాలని చూస్తున్నామని తెలిపారు.. రాష్ట్రంలో స్మగ్లర్ల మాట వినపడకూడదని అన్నారు సీఎం చంద్రబాబు.
Read Also: CM Chandrababu Warning: భూకబ్జాలపై సీఎం సీరియస్.. తాట తీస్తా..!
ఆ తర్వాత గోశాలలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు.. సదస్సులో పది మంది నుంచీ సరాసరి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లో భూ కబ్జాలు దారుణంగా జరిగాయన్నారు.. ఇన్నాళ్ళకు ప్రజల కళ్ళలో నవ్వు కనిపించిందన్నారు.. సెంటు భూమి కబ్జా చేసినా ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.. భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపులకు పాల్పడితే జైలే దిక్కు అన్నారు సీఎం చంద్రబాబు… భూ సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వం అండగా ఉంటుంది… సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాం, రీసర్వేలోని తప్పులనూ సరిచేస్తాం, ప్రతిఒక్కరికీ న్యాయం చేయాలనేది నా ఆలోచన, ఎన్‌డీఏ ప్రభుత్వం ఆలోచన అని తెలిపారాయన.. ఎంతో నమ్మకంతో 57 శాతం ఓట్లతో మమ్మల్ని గెలిపించారు.. ప్రజల ఆశల్ని నెరవేర్చేందుకు ఆరు నెలలుగా కష్టపడుతున్నాం… గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసింది.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో మన భూమికి దిక్కులేకుండా చేసే పరిస్థితిని తీసుకొచ్చారు. రెవెన్యూ సదస్సుల ద్వారా 95,263 పిటిషన్లు వచ్చాయి.. దాదాపు 3 లక్షల మంది సదస్సులకు హాజరయ్యారన్నారు.. పాస్‌పుస్తకంపై క్యూఆర్ కోడ్, జియో ట్యాగింగ్‌తో ఎప్పటికప్పుడు రికార్డులను పరిశీలించుకునే అవకాశం కల్పిస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక, తన పర్యటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు సీఎం చంద్రబాబు..
రాష్ట్రంలో ధాన్యం సేకరణ తీరును క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాను. కృష్ణా జిల్లా గంగూరులో రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ విధానం పై వారి అభిప్రాయాలు తెలుసుకున్నాను. అన్నదాతలకు మరింత లబ్ది చేకూర్చడానికి ఏం చేయాలి అనే అంశాలపై వారితో మాట్లాడాను. నా ఆలోచనలు కూడా వారితో పంచుకున్నాను.… pic.twitter.com/t4KgKQeSCI
— N Chandrababu Naidu (@ncbn) December 20, 2024