రేపటి నుంచి రెండో విడత రుణ మాఫీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపటి నుంచి రెండో విడత రుణ మాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్టు ప్రకటించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్నాం.. మహనీయుల స్ఫూర్తి, మహాత్ముడి అహింసా మార్గం, ప్రజాస్వామ్య పద్ధతిలో మహోద్యమాన్ని నిర్మించి తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం అన్నారు. ఏ ఆశయ సాఫల్యం కోసం స్వరాష్ట్రాన్ని కోరుకున్నమో ఆ లక్ష్యసాధన దిశగా నాటి ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి నేతృత్వంలో ముందుకు వెళ్తున్నాం అన్నారు.
ఇక, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికే తలమానికంగా ఉందన్నారు హరీష్‌రావు… సమైక్య పాలనలో వలసలు, ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలకు నెలవుగా ఉన్న తెలంగాణను, స్వ రాష్ట్రంలో ఇవాళ దేశానికే అన్నం పెట్టే.. దేశపు భాండాగారంగా మారిందన్నారు.. రెండో విడతలో 50 వేల రూపాయల లోపు పంట రుణం పొందిన 27,753 మంది అర్హులైన రైతులకు గాను 94.56 కోట్ల రూపాయల రుణమాఫీ చేయనున్నామని.. రేపటి నుంచి రెండో విడత రుణ మాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నామని వెల్లడించారు హరీష్‌రావు.. మరోవైపు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణ రూపురేఖలే మారనున్నాయన.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా నిర్మాణమైన ప్రాజెక్ట్ గా కాళేశ్వరం చరిత్ర సృష్టించిందన్నారు.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
తాజావార్తలు
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!