అన్నదాతలకు తీపికబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. పీఎం కిసాన్ పథకం 9వ విడత నిధులు విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. రూ. 19,500 కోట్ల ఫండ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేయగా… దేశవ్యాప్తంగా 9.75 కోట్ల మంది రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ అవుతున్నాయి… పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు ప్రతీ సంవత్సరం రూ. 6 వేలు అందిస్తోంది కేంద్రం.. ఈ మొత్తాన్ని నాలుగు నెలల వ్యవధిలో మూడుసార్లు రూ. 2 వేలు చొప్పున ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. 2047లో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయినప్పుడు భారతదేశ పరిస్థితిని నిర్ణయించడంలో మన వ్యవసాయం మరియు మా రైతుల పాత్ర చాలా కీలకమైనది తెలిపారు.
ఎమ్‌ఎస్‌పి వద్ద రైతుల నుండి ఇప్పటివరకు పెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు ప్రధాని.. రూ .1,70,000 కోట్లు నేరుగా వరి రైతుల ఖాతాల్లోకి చేరాయని.. సుమారు రూ. 85,000 కోట్లు గోధుమ రైతుల ఖాతాల్లో వేశామన్నారు.. ఇక, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచినందుకు రైతులకు ధన్యవాదాలు తెలిపారు.. నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్-ఆయిల్ పామ్ అంటే NMEO-OP దేశం వంట నూనెలో స్వయం-ఆధారిత ప్రతిజ్ఞ చేసింది. వంట నూనె పర్యావరణ వ్యవస్థలో రూ .11,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టబడుతుందన్నారు. వ్యవసాయ ఎగుమతుల విషయంలో భారతదేశం మొదటిసారిగా ప్రపంచంలోని టాప్ -10 దేశాలలో చేరిందని తెలిపారు.. దేశ వ్యవసాయ విధానాలలో చిన్న రైతులకు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతోందని వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోడీ.