గత 40 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న భూమిని అన్యాయంగా లాగేసుకున్నారని జాయింట్ కలెక్టర్ కాళ్లపై పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకొంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ స్వర్ణలత కాళ్లపై పడి రైతులు వేడుకున్నారు. గణపురం మండలం కొండాపూర్ శివారులో గత 40 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న 8/151 సర్వేనెంబర్ లోని రెండున్నర ఎకరాల భూమిని బాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పట్టాచేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ కాళ్లపై పడి రైతులు వేడుకున్నారు.