గుంటూరు : తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని సెగ తగిలింది. మందడం నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీదేవిని…కొందరు దళిత మహిళ రైతులు, రైతులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో.. ఆ దళిత రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మందడం నూతన సచివాలయం ప్రారంభోత్సం నుంచి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వెళ్ళాక.. ఆ రైతులను పోలీసులు వదిలిపెట్టారు. అయితే.. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రైతులు. రాజధాని రైతుల సమస్యలపై వినతి పత్రం ఇద్దామనుకుంటే అరెస్టు చేశారని పోలీసులపై నిప్పులు చెరిగారు దళిత రైతులు.