బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత రెండు నెలలు గా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
సుపరిపాలన కాదు సుద్దు దండగా పాలన అని మాజీ మంత్రి ఆర్‌కే ఆరోజా అన్నారు. రూ.1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన? అని ప్రశ్నించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. "రూ. 81వేలకోట్లు ప్రజలకు ఎగనామం పెట్టడం సుపరిపాలన ? సూపర్ సిక్స్ అమలు చేయకపోవడమే సుపరిపాలన అంటారా? ఆడపిల్లను అత్యాచారాలు చేయడం చంపడం సుపరిపాలన ? రాష్ట్రం మొత్తం గంజాయి డ్రగ్స్ డోర్ డెలివరీ చేయడం, విద్యుత్ ఛార్జీలు పెంచడం సుపరిపాలన అంటారా? సీబీఎన్ అంటేనే…
రైతు సమస్యలపై ఫోకస్ పెంచింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. తాజాగా పొగాకు, మామిడి, కోకో కొనుగోళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పొగాకు రైతుల సమస్యలకు చెక్ పెట్టేందుకు మార్క్ ఫెడ్ నుంచి కొనుగోలు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని.. అందుకే వెన్నుపోటు దినం నిర్వహించామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్బుతమైన స్పందన లభించిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన జనాల పైనే రేవంత్ రెడ్డి తన ప్రతాపం చూపిస్తున్నారని.. హైడ్రా తో ఇళ్లను కూలగొట్టడం, రైతుల ధాన్యం కొనక పోవడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.
NVSS Prabhakar : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్. కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్య ఓ రహస్య రాజకీయ డీల్ కుదిరిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్‌ఎస్ విలీనానికి గ్రౌండ్ వర్క్ మొదలైపోయిందని, ఇప్పటికే రెండుపార్టీల కీలక నేతల మధ్య రాజీ కుదిరిందని అన్నారు. ఈ డీల్‌లో భాగంగానే కాలేశ్వరం అవినీతి, విద్యుత్ కొనుగోళ్ల స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక అంశాలపై…
Beerla Ilaiah : తెలంగాణలో రాజకీయ విమర్శలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ కవితపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. కవిత ఇప్పటికైనా తెలంగాణ పట్ల సోయి చూపించడం గమనార్హమని చెప్పారు. సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని ఇప్పుడు కవితకు అర్థమవుతోందంటే, గత 10 ఏళ్లలో తండ్రి కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో ఇప్పుడు ఆమె గుర్తించుకుంటున్నట్లు తెలుస్తోందని ఐలయ్య…
Niranjan Reddy : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డిపై ప్రత్యేకంగా మండిపడ్డారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఒక్క అడుగు ముందుకు వేయకపోవడం మాతృద్రోహం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఏడాదిన్నర కాలంగా తట్టెడు మన్ను కూడా…
MLC Kavitha : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండు రోజుల పర్యటనను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం చేరుకున్న కవితకు బీఆర్ఎస్ నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వడ్డిరాజు రవిచంద్ర నివాసాన్ని కవిత సందర్శించగా, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం.. ఇటీవల స్వల్ప అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ సీనియర్…