Alleti Maheshwar Reddy : ఇది ప్రజల సమస్యలపై చర్చను అణగదొక్కే ప్రయత్నం
- ఒక్కరోజు సమావేశం.. ప్రజా సమస్యలకు తలుపులు మూసిన ప్రభుత్వమా?
- వరదల వల్ల పంట నష్టం, యూరియా కొరతపై చర్చ ఎందుకు దూరం?
- ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగుల సమస్యలపై మౌనమే ఎందుకు?
- బీజేపీ హామీ – అసెంబ్లీలో తప్పక ప్రజా సమస్యలే ప్రధాన చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alleti Maheshwar Reddy : అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఒకే రోజు పరిమితం చేయడం పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని ఆరోపించారు. ఆదివారం ఒక్కరోజే సమావేశాలు ఉంటాయని మంత్రి శ్రీధర్ బాబు, బట్టి గారు ముందే ప్రకటించారని, ఇది ప్రజల సమస్యలపై చర్చను అణగదొక్కే ప్రయత్నమని ఆయన అన్నారు.
Jimmy Gaminlune Mate: సహాయక చర్యల్లో ప్రాణాలు వదలిన అగ్నివీరుడు..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
వరదల కారణంగా వేల ఎకరాల పంటలు నాశనం అయ్యాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కానీ ఆ అంశంపై కూడా ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా లేనట్లు స్పష్టమైందన్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుండగా, ముఖ్యమంత్రి దానిపై సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని ఆయన విమర్శించారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగుల సమస్య, రైతులు మరియు మహిళలకు ఇచ్చిన హామీలు, మాజీ సర్పంచుల బకాయిలు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, రెవెన్యూ, విద్యుత్, వైద్య రంగ సమస్యలపై చర్చ జరగాలని బీజేపీ ప్రతిపాదించినా ప్రభుత్వం దానికి సంధానం లేకుండా తప్పించుకుంటోందని మండిపడ్డారు.
కనీసం 30 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ కోరిందని, కానీ ప్రభుత్వం ఒక్కరోజు సమావేశంతోనే సభను ‘బుల్డోజ్’ చేయాలని చూస్తోందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు అత్యంత కీలకమైన సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వకుండా, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తమకవసరమైన విషయాలనే ఎంచుకుని చర్చ పెడుతున్నారని విమర్శించారు. “కనీసం ఎన్ని రోజులు అసెంబ్లీ నడుస్తుందో కూడా స్పష్టంగా చెప్పకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజా సమస్యలపై చర్చకు రాకుండా గొంతు నొక్కేస్తోంది. రేపు మాత్రం బీజేపీ తరఫున ఈ సమస్యలన్నింటినీ అసెంబ్లీలో ప్రస్తావిస్తాం” అని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
Asia Cup 2025: అభిమానులకు కీలక అప్‌డేట్.. ఆసియా కప్ షెడ్యూల్‌లో మార్పు!
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..