Farmers Income: ఈ సంవత్సరం రైతుల ఆర్థిక పరిస్థితి బాగుంటుందని ఒక అధ్యయన సంస్థ శుభవార్త చెప్పింది. రబీ సీజన్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో నమోదవుతుందని అంచనా వేసింది. ఓపెన్ మార్కెట్‌లో పంటల రేట్లు కూడా భారీగానే పెరగనున్నాయని.. ఫలితంగా.. కర్షకులకు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పేర్కొంది. ఎరువుల రేట్లు సైతం దిగొస్తాయని, తద్వారా అన్నదాతలకు అన్నివిధాలుగా కలిసొస్తుందని వివరించింది.
Business Headlines: పెరిగిన జీఎస్టీ రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. లేబుల్ వేసిన ఫుడ్ ఐటమ్స్‌తోపాటు రూమ్ రెంట్ ఐదు వేల రూపాయలకు పైగా ఉన్న ఆస్పత్రుల బిల్లులపై అదనంగా ఐదు శాతం జీఎస్టీని ఇవాళ్టి నుంచి చెల్లించాల్సి ఉంటుంది.