కేటీఆర్ అసలు రంగు బయటపడిందని.. కేటీఆర్ ట్విట్టర్ లో కాదు.. జనాల్లోకి రా అని కవిత కూడా చెప్పిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కుటుంబంలో ఉన్న సవాళ్లకు సమాధానం చెప్పుకోలేని కేటీఆర్.. ప్రజలకు ఏం చేస్తాడు? అని ఎద్దేవా చేశారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. కవిత కామెంట్స్ తో కేసీఆర్ అసలు రంగు బయటపడిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ముసుగు తొలిగిపోయిందని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో ఒకేలా సీన్లు రిపీట్ అవుతున్నాయన్నారు. తండ్రులు సంపాదించిన ఆస్తుల పంపకాల్లో, రాజకీయ పదవుల్లో పంపకాల్లో తేడాలున్నాయని.. అన్నలు వదిలిన బాణాలు.. అన్నల మీదికే చెల్లెలు గురిపేడుతున్నారన్నారు.
"లెటర్ టూ డాడి" అని కవిత రాసిన లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. దాని టైటిల్ కాంగ్రెస్ వదిలిన బాణమని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్.. బీఆర్ఎస్ రెండు పార్టీలు విఫలం అయ్యాయన్నారు. అందుకే అవి రెండు కలిసి బిజెపిని బద్నాం చేసే కుట్రలకు తెరలేపాయని.. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం..అది గాంధీల కుటుంబం అయిన కల్వకుంట్ల కుటుంబం అయిన అని స్పష్టం చేశారు. వారి కుటుంబ సంక్షోభాలను…
జగన్ కమిడియన్ అయితే.. మరి నువ్వేంటి? అని ఎమ్మెల్సీ నాగబాబును మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "నువ్వు, మీ అన్న, మీ తమ్ముడు ముగ్గురూ రాజకీయాల్లోకి వచ్చారు. మీ అన్న ఎలాగోలా కాంగ్రెస్‌లో చేరి మంత్రి అయ్యాడు. శాసనసభకు రావడానికి మీ తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి పదహారు సంవత్సరాల సమయం పట్టింది. అది కూడా చంద్రబాబు నాయుడు సంక ఎక్కితే ఎమ్మెల్యే అయ్యారు.
వారసత్వ రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే! పార్టీ పగ్గాలు దాదాపు వారసులకే దక్కుతాయి. తరతరాలుగా రాజకీయాల్లో కొనసాగుతోన్న సంస్కృతి ఇది. ఈ నేపథ్యంలోనే టీడీపీ పగ్గాలు నారా లోకేశ్‌కే దక్కుతాయని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. పార్టీ నేతలు అదే చెప్తూ వస్తున్నారు. అయితే.. వారసత్వం ఒక్కటే పరమావధి కాదని, కష్టపడి పని చేసే తత్వం ఉన్న వాళ్ళకే అవకాశం దక్కుతుందని చంద్రబాబు…