ఇటీవలి కాలంలో యువత ప్రేమ అంటూ లేని చిక్కులు తెచ్చుకుంటున్నారు. పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కూతురు ప్రేమించిన వ్యక్తి తమ కులానికి చెందిన వ్యక్తి కాదని కన్న తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. సమాజంలో పరువు ఎక్కడపోతుందో అని భావించిన తల్లిదండ్రులు ప్రాణాలు కూడా తీసేందుకు వెనకాడటం లేదు. ఈ క్రమంలో ఓ సంచలన ఘటన వెలుగు చూసింది.