హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనను పరిశీలించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఊడిమూడి శివారు చింతావారి పేట సమీపంలో పంటకాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని రుద్రంపల్లి గ్రామంలో పాత మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. వర్షానికి నాని పాత మిద్దె కూలినట్లు స్థానికులు చెబుతున్నారు.