మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో విషాదం చోటు చేసుకుంది. గోరఖ్‌పూర్ నుంచి పూణే వెళ్తున్న పూణె వీక్లీ ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లోని ప్రయాణికులపై వేడి వేడి 'టీ' పడటంతో గందరగోళం నెలకొంది. ముగ్గురు ప్రయాణీకులపై టీ పడటంతో.. వారు ప్రయాణించే కోచ్ అల్లకల్లోలం అయింది. తమపై 'టీ' పడటంతో చాలా ఇబ్బందిగా, నొప్పిగి ఉందంటూ.. కోచ్ లో నెట్టడం, లాగడం చేశారు. ఈ గందరగోళంలో డోర్ వద్ద కూర్చున్న ఇద్దరు ప్రయాణికులకు తగలడంతో కదులుతున్న రైలు నుండి జారి పడిపోయారు