ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి సంబంధించి క్లూస్ టీం విచారణ ముగిసింది. బీబీనగర్‌లో రైల్వే స్టేషన్‌కు వచ్చిన క్లూస్ టీమ్ మంటల్లో కాలిపోయిన బోగీలను తనిఖీ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే బోగీల నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. సైంటిఫిక్ నివేదిక తర్వాతే అసలు వివరాలు చెబుతామని అధికారులు చెప్పారు.
Falaknuma Express: యాదాద్రి భువనగిరి జిల్లా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనలో ఏడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం 18 బోగీల్లో ఏడు బోగీలు దగ్ధం కావడంతో రైలు 11 బోగీలతో సికింద్రాబాద్ చేరుకుంది.
దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవల హెచ్చరిక లేఖ వచ్చినా...అధికారులు ఎందుకు అప్రమత్తం కాలేదు. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఘటనాస్థలానికి వెళ్లిన రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్...ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
Is there any conspirancy behind Falaknuma Express Train accident: ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య ఉదయం 11 గంటలకు బెంగాల్ నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లోని ఒక బోగీలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇక ఈ క్రమంలో ఆ బోగీలో ఉన్న వారు గమనించి వెంటనే చైన్ లాగడంతో అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశాడు. దీంతో బోగీలో ఉన్న ప్యాసింజర్లు ట్రైన్…
హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదానికి గురికావడంతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు రెండు రైళ్లను క్యాన్సిల్ చేశారు. మరో నాలుగు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్-రేపల్లె, సికింద్రాబాద్-మన్మాడ్ ట్రైన్స్ ను క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించారు. ఇక, సికింద్రాబాద్-తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్‌ను (వయా కాజీపేట, విజయవాడ), సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (వయా కాజీపేట, విజయవాడ) గుంటూరు వెళ్లే రైళ్లు కాజీపేట మీదుగా వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చారు.
Falaknuma Express: యాదాద్రి జిల్లాలో ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా బోగీలో మంటలు చెలరేగాయి. మంటలు పక్కనే ఉన్న బోగీలకు కూడా వ్యాపించాయి. ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది.