Falaknuma Express: ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. 5 బోగీలు పూర్తిగా దగ్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Falaknuma Express: యాదాద్రి జిల్లాలో ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా బోగీలో మంటలు చెలరేగాయి. మొత్తం 6 బోగీలకు వ్యాపించిన మంటలు.. పక్కనే ఉన్న బోగీలకు కూడా వ్యాపించాయి. ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. మంటలను గమనించిన ప్రయాణికులు వెంటనే రైలు నుంచి కిందకు దూకారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read also: Bandi Sanjay: కరీంనగర్ చేరుకున్న బండి సంజయ్.. బోరున ఏడ్చినకార్యకర్తలు
Also Read
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో బోగీలు దగ్ధం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించింది. లోకో పైలట్ గమనించి రైలును ఆపాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా రైలును అక్కడికక్కడే ఆపాల్సి వచ్చింది. ఈ రైలులో దాదాపు 1500 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 80 నుండి 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. భువనగిరి సమీపంలో రైలు వేగాన్ని తగ్గించడంతో మంటలను గుర్తించారు. ఈ రైలులోని ఎస్3, ఎస్4, ఎస్5, ఎస్6 కోచ్‌లు దగ్ధమైనట్లు సమాచారం.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ హరా నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో గంటలో ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకుంటారనగా ప్రమాదం జరిగింది. మంటలు ఇతర బోగీలకు వ్యాపించే చోట బోగీల మధ్య ఉన్న లింక్‌ను తొలగించారు. దీంతో ఇతర బోగీలకు మంటలు వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఛార్జింగ్ పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగడం వల్లే మంటలు చెలరేగాయని ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
-
Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
-
Sanju Samson: అప్పుడే ఆత్మవిశ్వాసం పెరిగింది.. భయం లేకుండా క్రికెట్ ఆడుతా.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!