IBomma Ravi : హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో మరోసారి కీలక వివరాలను వెలికితీశారు. పైరసీ వ్యవహారాన్ని పూర్తిగా తన అసలైన గుర్తింపుకి దూరంగా ఉంచాలని రవి ముందుగానే నిర్ణయించుకున్నట్లు విచారణలో స్పష్టం అయింది. ఇందుకోసం అతడు ‘ప్రహ్లాద్’ పేరుతో పూర్తిగా ఫేక్ ఐడెంటిటీని సృష్టించుకుని, ఆ పేరుతో వివిధ పత్రాలు, బ్యాంకింగ్ వ్యవస్థలు, కంపెనీ రిజిస్ట్రేషన్లను నిర్వహించాడు. రవి ప్రహ్లాద్ పేరుతోనే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడంతో పాటు,…
హైడ్రా పేరు చెప్పిబెదిరించిన ఇరువురిపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మిరియాల వేదాంతం, యెలిసెట్టి శోభన్ బాబు గండిపేట మండలం, నెక్నాంపూర్ విలేజ్‌లోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఓ ఇంటికి వెళ్లి బెదిరించినట్టు పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. ఈ నెల 23న మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నలుపు రంగు కారులో వచ్చిన ఈ ఇద్దరు ఇంటి ఆవరణలోకి వచ్చి పరిశీలిస్తుండగా.. ఎవరని అడిగితే తాము హైడ్రా నుంచి వచ్చామని బదులిచ్చారని…
Online Love Scam: ఈ డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ వలన పరస్పర సంబంధాలు సులభంగా ఏర్పడుతున్నప్పటికీ, దుర్వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పరిచయమై, ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడే సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఫిలింనగర్‌లో ఇలాంటి ఒక వింత కేసు నమోదైంది. Read Also: Ganga River: గంగా నదికి ప్రకృతి వరం.. నీటి స్వచ్ఛతను…
Matrimonial Sites: గుజరాత్‌కి చెందిన 26 ఏళ్ల యువకుడిని వసాయి ఈస్ట్‌లోని వాలివ్ పోలీస్ బుధవారం అరెస్ట్ చేసారు. అతను మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌ల ద్వారా పరిచయం అయిన 15కి పైగా మహిళలను గత రెండున్నర సంవత్సరాలుగా పెళ్లి పేరుతో మోసం చేసి లైంగికంగా, ఆర్థికంగా దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అహ్మదాబాద్‌కు చెందిన హిమాంషు యోగేశ్‌భాయ్ పంచాల్ అనే వ్యక్తి మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లలో తనను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సైబర్ సెక్యూరిటీ డివిజన్‌లో…
Fraud Case: ప్రధాని నరేంద్ర మోదీ కార్యదర్శి పీకే మిశ్రా పేరు వాడుతూ అడ్డదారిలో కోట్లు సంపాదించేందుకు ప్రయత్నించిన ఓ జంట అరెస్టు అయింది. ఒడిశా పోలీసులు హన్సితా అభిలిప్సా, అనిల్ మహంతి అనే దంపతులను అరెస్టు చేసారు పోలీసు అధికారులు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఇన్ఫోసిటీ ప్రాంతంలో విలాసవంతమైన కార్యాలయం నిర్వహిస్తూ.. హన్సితా అభిలిప్సా, అనిల్ మహంతి జంట ప్రధాన మంత్రి కార్యదర్శి పీకే మిశ్రా కుటుంబ సభ్యులుగా పరిచయం చేసుకునేవారు. ముఖ్యంగా మైనింగ్, నిర్మాణ…