అవకాశం దొరికితే చాలు జనాన్ని అడ్డంగా ముంచేస్తున్నారు కేటుగాళ్ళు. విశాఖలో ఓ నకిలీ సివిల్ సప్లైస్ అధికారి గుట్టురట్టయింది. పౌర సరఫరాల అధికారిగా చెప్పుకుంటూ హాస్టళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకుల నుంచి డబ్బులు దండుకుంటున్న రాజమహేంద్రవరానికి చెందిన ఆడంకి చక్రవర్తిని విశాఖలోని ఎంవీపీ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. చక్రవర్తి తన స్నేహితుడు శ్రీనివాస్‌తో కలిసి శనివారం ఎంవీపీ కాలనీలోని గోదావరి టిఫిన్ సెంటర్‌కు వెళ్లి కమర్షియల్ సిలిండర్లకు బదులు డొమెస్టిక్ సిలిండర్లను ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించాడు.…