Jobs In Country: దేశంలో ఎన్నికల వాతావరనం వచ్చేసింది. ఈ ఏడాది డిసెంబర్‌లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు తోడు ఆగస్టు చివరి నుంచి ఏప్రిల్ వరకు వివిధ పండుగలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పనిచేయడానికి.. అలాగే పండుగల కోసం వివిధ కంపెనీలు, సంస్థల్లో పనిచేయడానికి ఉద్యోగులు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నెలాఖరు నుంచే ఉద్యోగాల నియామకాల ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే వీటిలో కొత్త ఉద్యోగాలతో పాటు.. ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేసేందుకూ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం తాత్కాలిక పద్ధతిలో జరిగే నియామకాలే ఎక్కువగా ఉండనున్నాయి. 1200 కు పైగా నియామక సంస్థలు, కన్సల్టెంట్ల నుంచి సేకరించిన అభిప్రాయాలతో, నౌక్రీ హైరింగ్ ఔట్‌లుక్ పేరిట నివేదికను సోమవారం విడుదల చేసింది. ఆగస్టు చివరి వారం నుంచి సుమారు 7 నెలల పాటు పలు సెక్టార్లలో నిపుణులైన యువతకు అవకాశాలు రాబోతున్నాయని.. మార్కెట్ సర్వేలు, సిబ్బంది సేవల సంస్థలు మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా, టీమ్‌లీజ్, లింక్డ్‌ఇన్ వంటి సంస్థలు చెప్తున్నాయి.
Read also: NCL Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 338 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
ఎన్నికల సీజన్ ఇప్పటికే మొదలైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా డిజిటల్ వినియోగం పెరిగనుంది. రాజకీయ పార్టీలు సరికొత్త విధానాలను అనుసరిస్తున్నాయి. ఐటీ, సోషల్ మీడియాను తమ అవసరాలకు వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీ నిపుణుల అవసరం పెరుగుతుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దీనికితోడు ఆగస్టు నుంచి పండుగల సీజన్ మొదలవుతోందని, కొనుగోళ్ల సందడితో ఈ–కామర్స్ జోరందుకుంటుందని అంటున్నాయి. ఇవన్నీ కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. సర్వేలో పాల్గొన్న 92 శాతం మంది నియామకాలు పెరుగుతాయని అంచనా వేస్తుండగా.. 47 శాతం మంది రిక్రూటర్లు కొత్త అవకాశాలు, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ పెరుగుతాయని పేర్కొన్నారు. 26 శాతం మంది కేవలం కొత్త ఉద్యోగాలే పెరిగేందుకు అవకాశం ఉందని చెప్పారు. 20 శాతం మంది తమ ఉద్యోగుల సంఖ్య యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేయగా… కేవలం 4 శాతం మందే ఉద్యోగాల్లో కొంత మేరకు కోత ఉంటుందని తెలిపారు.
Read also: Mirror Break: పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచితే.. అరిష్టమా?
బిజినెస్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్ లాంటి ఉద్యోగాలకు అధిక గిరాకీ ఉంటుందని రిక్రూటర్లు భావిస్తున్నారు. కాస్త అనుభవం ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఉండబోతోంది. అనుభవం ఉన్న వారి తరువాత ప్రెషర్లకు అవకాశాలుంటాయి. సర్వేలో పాల్గొన్న దాదాపు 70 శాతం మంది రిక్రూటర్లు రాబోయే 7 నెలల్లో ఉద్యోగుల వలసల రేటు 15 శాతం లోపు ఉంటుందని చెబుతుండగా.. మరికొంతమంది మాత్రం 40 శాతం వరకు కొనసాగవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో ..ఉద్యోగులు తాము ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో కొనసాగేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని నివేదిక పేర్కొంది. బిజినెస్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్, మానవ వనరుల విభాగాల్లో అనుభవజ్ఞులు అత్యధికంగా ఉద్యోగాలు మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. ప్రస్తుత సీజన్‌లో దేశవ్యాప్తంగా 7 లక్షల మందికిపైగా ఉద్యోగులను పలు కంపెనీలు తాత్కాలికంగా నియమించుకునే వీలుందని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా, టీమ్‌లీజ్, లింక్డ్‌ఇన్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి.