వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి… మృతి చెందారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్న నిత్యానంద.. కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో చనిపోయినట్లు వార్తలొచ్చాయి. అయితే, తప్పుడు వదంతులపై నిత్యానంద క్లారిటీ ఇచ్చారు. తాను సమాధిలోకి వెళ్లానని… తన అనుచరులు, భక్తులు, శిష్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నట్లు వివరించిన నిత్యానంద… వైద్యుల బృందం చికిత్స చేస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. మనుషులు, పేర్లు, ప్రాంతాలను గుర్తుపట్టలేకపోతున్నానని… కోలుకోవడానికి సమయం పడుతుందని వెల్లడించారు.
Read Also: Ukraine Russia War: వెనక్కి తగ్గిన రష్యా.. మళ్లీ ఆ సిటీ ఉక్రెయిన్ వశం..!
కాగా, భారత్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద… 2019లో విదేశాలకు పారిపోయారు. కైలాస అనే ప్రపంచానికి… తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. కైలాసను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు. కొద్దిరోజులకు కైలాసకు ప్రత్యేక కరెన్సీని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను ప్రారంభించారు. ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపంలో ఆయన నివాసం ఉంటున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీన్ని ఈక్వెడార్ మాత్రం… కొద్ది రోజులుగా ఖండిస్తూనే ఉంది.