Wanaparthy: వనపర్తి జిల్లా కేంద్రంలో దారుణ హత్య కేసు వెలుగుచూసింది. వివాహేతర సంబంధం కారణంగా భార్యే భర్త ప్రాణాలు తీసింది. జిల్లా కేంద్రంలో కురుమూర్తి, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. భార్య నాగమణి శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేత బంధం పెట్టుకుంది. వీరిద్దరి మధ్య భర్త ఎందుకు? అని నాగమణి భావించింది. ఎలాగైనా అడ్డు తొలగించాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.