Nellore M*urder: కడుపులో, గొంతుపై కత్తితో విచక్షణారహితంగా పొడిచి భార్యను హతమార్చిన భర్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore M*urder: భార్య ప్రవర్తనతో అతను విసిగిపోయాడు.. పద్ధతి మార్చుకోవాలంటూ పదేపదే ఆమెకు చెప్పాడు.. కానీ ఆమె వినలేదు.. దీంతో ఆమెకు దూరంగా ఉంటూ వచ్చిన భర్త.. చివరకు ఆమెను అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు.. ఈ ఘటన నెల్లూరులో సంచలనం కలిగించింది.
భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన నెల్లూరులోని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అయోధ్య నగర్లో జరిగింది. ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెంకి చెందిన నందినికి.. కోటమిట్టకు చెందిన శ్రీహరికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. శ్రీహరి నెల్లూరులోని ఓ ప్రైవేట్ బస్సు సర్వీస్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఐదేళ్లపాటు సజావుగా సాగిన వీరి కాపురంలో మనస్పర్ధలు నెలకొన్నాయి. నందిని మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడంతో దంపతుల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. దీంతో రోజూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
Sun Massive Explosion : సూర్యుడిపై 17 భారీ పేలుళ్లు.. భూమికి పొంచి ఉన్న డేంజర్ ఇదే.!
శ్రీహరికి, నందినికి మధ్య గొడవలు రోజు జరుగుతూ ఉండడంతో.. తొమ్మిది నెలల నుంచి భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. నందిని.. భర్తను, కుమార్తెను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకొని మధ్యలో ఆగిపోయారు. అప్పుడప్పుడు ఇద్దరూ ఫోన్ చేసి మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఆమెను ఎలాగైనా చంపేయాలని శ్రీహరి 3 నెలల కిందట నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి భార్యతో మాట్లాడుతూ.. ఆమె కదలికలను గమనించేవాడు.. నందినికి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆమె ఆక్కడికి వెళ్లిపోయింది. అక్కడి నుంచే శ్రీహరితో తరచూ మాట్లాడుతూ ఉండేది.
రెండు రోజుల క్రితం నెల్లూరుకు వస్తున్నట్లు శ్రీహరికి ఆమె ఫోన్ చేసి చెప్పింది. పికప్ చేసుకునేందుకు చింతా రెడ్డిపాలెం నేషనల్ హైవే వద్దకు రావాలని సూచించింది. దీంతో శ్రీహరి ఆమెను అంతమొందించేందుకు తన వెంట కత్తి తీసుకువెళ్లాడు. ఆమె బస్సు దిగగానే భార్యతో మాట్లాడుకుంటూ సమీపంలోని అయోధ్య నగర్ నాలుగో వీధిలోని ఖాళీ స్థలం వద్దకు వచ్చాడు. అక్కడ ఆమెతో గొడవపడ్డాడు. నందిని ఎదురు తిరగడంతో తన వద్దనున్న కత్తితో కడుపులో, గొంతుపై విచక్షణ రహితంగా పొడిచి ఆమెను హత్య చేసి పరారయ్యాడు.
Vivo X300 Ultra Leaks: 200MP+200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ఇండియన్ మార్కెట్ షేకే ఇగ!
సమాచారం తెలుసుకున్న బాలాజీ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిజిహెచ్ మార్చురీకి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న శ్రీహరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. తల్లి చనిపోవడం, తండ్రి జైలుకు పోవడంతో నాలుగేళ్ల చిన్నారి ఒంటరిగా మిగిలిపోయింది.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!