Bharat Express: నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశానికి ఏకకాలంలో 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ 9 రైళ్లు ప్రయాణికులకు దేశంలోని అనేక మతపరమైన, ఇతర పర్యాటక ప్రదేశాలకు ప్రీమియం, సూపర్‌ఫాస్ట్ ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో కరోనా కారణంగా నిలిచిపోయిన 12 ప్యాసింజర్ రైళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. అయితే ఇకపై ఇవి అన్‌రిజర్వుడు ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది. ఫలితంగా ఆయా రైళ్లలో టిక్కెట్ ఛార్జీలు పెరగడంతో పాటు అవి ఆగే స్టేషన్ల సంఖ్య కూడా పరిమితం కానుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారిన ప్యాసింజర్ రైళ్లు:✤ కాచిగూడ-మిర్యాలగూడ-కాచిగూడ (07276/07974). ఈ నెల 11 నుంచి అందుబాటులోకి వస్తుంది.✤ మిర్యాలగూడ-నడికుడి-మిర్యాలగూడ (07277/07273). ఈ రైలు…