Wines Tender : ఒక్కరోజే 10 వేల దరఖాస్తులు.. ఇంకా రెండు రోజులే గడువు
- ఒక్కరోజే 10 వేల మద్యం షాపుల దరఖాస్తులు
- ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం
- 25 వేలు దాటిన మద్యం షాపుల దరఖాస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wines Tender : తెలంగాణలో వైన్ షాపుల టెండర్లకు ఈసారి అంచనాలకు మించి స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,620 మద్యం షాపుల కేటాయింపుకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించిన నేపథ్యంలో కేవలం ఒక్కరోజులోనే దాదాపు 10 వేల దరఖాస్తులు సమర్పించబడ్డాయి. ఈ దరఖాస్తుల విక్రయాల ద్వారా ప్రభుత్వంకు భారీ ఆదాయం చేరింది.
Wife: పాపం రా.. అనారోగ్యం ఉందని చెప్పకుండా తనకిచ్చి పెళ్లి చేశారని.. కట్టుకున్న భార్యను
Also Read
ఇప్పటివరకు మొత్తం 25 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. టెండర్ సమర్పణకు ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండటంతో, చివరి రోజుల్లో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో చివరి రెండు రోజుల్లో భారీ స్పందన నమోదై, 60 వేలకు పైగా దరఖాస్తులు వచ్చిన విషయం గుర్తుచేసుకున్నారు.
ఈసారి కూడా అదే రీతిలో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశముందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త లైసెన్సుల కేటాయింపుతోపాటు, ఆదాయం పెంచుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ టెండర్ ప్రక్రియను వేగవంతం చేసింది. చివరి తేదీ సమీపిస్తుండటంతో మద్యం వ్యాపార వర్గాలు దరఖాస్తుల సమర్పణలో చురుకుగా పాల్గొంటున్నాయి.
Cyber Fraud: సందర్భమేదైనా.. సైబర్ నేరగాళ్ల ఎంట్రీ.. రెండు రోజుల్లో ఏకంగా 400 మందిని మోసం
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!