వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటన గుంటూరు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. నిన్న వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటనలో పోలీసులు ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీంతో వారి అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ నేత అరవింద్ బాబు ధర్నా చేపట్టారు. పోలీసులు అరవింద్ బాబు ధర్నా చేపట్టిన స్థలానికి చేరుకొని ధర్నా ఆపే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో అరవింద్‌కు గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.…
ఏపీలో వరి వార్ మొదలైంది. తెలంగాణలో వరి వేయవద్దంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో గందరగోళం నెలకొంది. ఏపీలో కూడా వరి వేయవద్దంటూ అధికారి వైసీపీ నేతలు చెప్పడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై స్పందించిన టీడీపీ నేత, మాజీ మంత్రి జవహార్ సీఎం జగన్, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ.. జగన్ చర్యలతో వ్యవసాయం కుదేలైందని, సీఎం జగన్ ఏపీలో వరిపంటకు ఉరివేశాడంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.…
ఏపీలో రాజకీయం రాజుకుంది. అటు టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా టీడీపీ ఈ రోజు ఏపీ బంద్ కు పిలుపునిస్తే.. కౌంటర్ గా వైసీపీ కూడా టీడీపీ నేతల వ్యాఖ్యలపై నిరసనలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి జవహార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, పార్టీ నాయకులపై దాడులు ద్వారా అంతర యుద్ధం జరగాలని జగన్ కోరుకున్నాడని ఆరోపణలు చేశారు. జగన్ తన రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టాడని విమర్శించారు.…