ట్రబుల్ షూటర్.... ఈ మాట వినగానే..... కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చే పేరు హరీష్‌రావు. ఉద్యమ సమయంలో... కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చేరింది బీఆర్‌ఎస్. అప్పుడు ఎమ్మెల్యేగా కూడా లేని హరీష్‌రావుని మంత్రిని చేశారు కేసీఆర్. అలాగే హరీష్ కూడా మామకు నమ్మిన బంటు అనడంలో ఆశ్చర్యం లేదంటారు పొలిటికల్ పండిట్స్.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వివేకానంద గౌడ్, లక్ష్మారెడ్డి, మాగంటి గోపినాథ్, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అరికెపూడి గాంధీ వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి చేశారు.. ఏసీపీ, సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర పనులు చేస్తోందని మండిపడ్డారు.