Chiranjeevi- Nagarjuna : మెగాస్టార్ చిరంజీవి-నాగార్జున కాంబోలో మల్టీస్టారర్ కోసం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగార్జున, చిరు ఎంతో క్లోజ్ గా ఉంటారు. నిత్యం కలుసుకుంటూనే ఉంటారు. ప్రతి విషయంలో ఒకరికి ఒకరు అండగా ఉంటారు. ఒకరి ఇంట్లో ఫంక్షన్లకు ఇంకొకరు వచ్చి సందడి చేస్తుంటారు. అలాంటి వీరిద్దరూ ఎందుకు మల్టీస్టారర్ చేయలేదు అనే డౌట్ అందరికీ ఉండే ఉంటుంది. ఓ సారి వీరిద్దరి కాంబోలో మల్టీ స్టారర్ ప్లాన్ చేశారు. ఆయన ఎవరో కాదు…
పటాస్ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అనిల్ రావిపూడి అతి తక్కువ సమయంలో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా అవతరించాడు. ఆయన దర్శకుడిగా మారి 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈరోజు మీడియాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. పటాస్తో మొదలుపెట్టి ఇటీవల రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. 10 ఏళ్ల వ్యవధిలో ఎనిమిది సినిమాలు ఫ్లాప్ లేకుండా పూర్తి చేయడం గమనార్హం.…
Shakeela: శృంగార తార షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఆమె నటించిన సినిమాలు.. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి. ఆమె బయోపిక్ కూడా అభిమానుల ముందుకు కూడా వచ్చింది. ఇక ఆమె జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే అని తెలుసు.. కానీ, అందులో కూడా చాలా రహస్యాలు ఉన్నాయని.. ఆమె నిత్యం ఏదో ఒక విషయాన్ని బయటపెడుతూనే ఉంటుంది.
“నవ్వు నారాయణుడు ఇచ్చిన వరం” అన్నారు పెద్దలు. ఆ మాటనే పట్టుకొని సాగారు ఇ.వి.వి. సత్యనారాయణ. నవ్వడంలోని యోగాన్ని, నవ్వించడంలోని భోగాన్నీ గురువు జంధ్యాల దగ్గర ఒడిసిపట్టి, ఆపై కితకితలు పెట్టి ‘జంబలకిడిపంబ’ పలికించారు ఇ.వి.వి. ఆయన పూయించిన నవ్వుల పువ్వుల గుబాళింపు ఈ నాటికీ ఆనందం పంచుతోంది. ఆహ్లాదం పెంచుతోంది. ఇ.వి.వి. సత్యనారాయణ 1956 జూన్ 10న పశ్చిమ గోదావరి జిల్లా కోరుమామిడి గ్రామంలో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ సినిమాలు చూస్తూ, వాటిలోని తప్పొప్పులను…
(మార్చి 19న ‘సీతారత్నంగారి అబ్బాయి’కి 30 ఏళ్ళు)కొన్నిసార్లు కొన్ని కాంబినేషన్లను జనం భలేగా ఆదరిస్తారు. వినోద్ కుమార్, రోజా జంటను అప్పట్లో ప్రేక్షకులు మెచ్చారు. వారు నటించిన చిత్రాలను బాక్సాఫీస్ వద్ద సక్సెస్ రూటులో సాగేలా చేశారు. అలా వారు నటించిన ‘సీతారత్నం గారి అబ్బాయి’ చిత్రాన్ని విజయపథంలో పయనింప చేశారు. 1992 మార్చి 19న విడుదలైన ‘సీతారత్నంగారి అబ్బాయి’ మంచి విజయం సాధించి, వినోద్ కుమార్, రోజా జోడీకి మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ…
గురువేమో నవ్వు నాలుగు వందల విధాల గ్రేటు అన్నారు. శిష్యుడేమో ఆ సూత్రాన్ని పట్టుకొని నలుదిశలా నవ్వుల పువ్వులు పూయించారు. ఆ గురువు ఎవరంటే ‘నవ్వడం భోగం… నవ్వించడం యోగం… నవ్వకపోవడం రోగం…’ అని చాటిన జంధ్యాల. ఇక ఆ శిష్యుడు ‘నవ్వేందుకే ఈ జీవితం’ అన్నట్టుగా సాగిన ఇ.వి.వి సత్యనారాయణ.తొలి చిత్రం ‘చెవిలో పువ్వు’ మొదలు చివరి దాకా ఏ సినిమా తీసినా, వాటిలో నవ్వులకే పెద్ద పీట వేశారు ఇ.వి.వి. అందుకే ఆయన సినిమాలు…
టాలీవుడ్ లో నటుడిగా, రచయితగా తనికెళ్ళ భరణి సుపరిచితుడే. ఇక ఆయన శివుడిపై రాసే కవితలకు ఫ్యాన్స్ మాములుగా ఉండరు. అయితే చిత్ర పరిశ్రమలో ఉంటున్నామంటే ఎన్ని పురస్కారాలు ఉంటాయో.. అన్ని తిరస్కారాలు కూడా ఉంటాయి. ఎంతమంది మెచ్చేవాళ్ళు ఉంటారో అంతేముంది తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. తాజగా ఇక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తనను తిట్టడం కాదు.. చంపేస్తామని బెదిరించారని కూడా చెప్పుకొచ్చారు. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ఊహ హీరోయిన్ గా ఆమె సినిమా తెరకెక్కిన సంగతి…
(అక్టోబర్ 11న ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’కి 25 ఏళ్ళు)పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరపై కనిపించిన తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు రామలింగయ్య సమర్పణలో అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ నాయికగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి చిన్నతమ్ముడుగా కళ్యాణ్ ఈ సినిమాతో పరిచయం కావడం చిరు అభిమానులకు మహదానందం కలిగించింది. పైగా…