Geetha singh : అల్లరి నరేశ్ సరసన నటించిన హీరోయిన్ గీతాసింగ్ గుర్తుందా.. తన చలాకీ నటనతో ప్రేక్షకులకు ‘కితకితలు’ పెట్టేసింది. లేడీ కమెడియన్ గా గీతా సింగ్‌ను ఎవరూ మరచిపోలేరు. తేజ డైరక్షన్ లో వచ్చిన జై సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టినా ఎవడి గోల వాడిది చిత్రంతో కమెడియన్ గా గుర్తింపు వచ్చింది. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన కితకితలు చిత్రం ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ చిత్రంలో కడుపుబ్బ నవ్వించడమే కాకుండా లావుగా ఉండటం వలన చుట్టు పక్కల జనాల కారణంగా ఎదుర్కొనే అవమానాలను చాలా చక్కగా చూపించింది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి లేడీ కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఏకంగా ఐదు వందలకు పైగా సినిమాల్లో నటించింది.
Read Also: mirzapur : ఇండస్ట్రీలో విషాదం.. మీర్జాపూర్ నటుడి కన్నుమూత
అయితే గీతాసింగ్ కొంతకాలంగా వెండితెరపై కనిపించడం లేదు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన విషాద కోణాన్ని ఆవిష్కరించింది. ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు సినిమాల్లో ఫిమేల్ యాక్టర్స్ లేరని.. అంతా మేలే ఉన్నారని పేర్కొంది. ఇండస్ట్రీలో ఎంతో మంది లేడీ కమెడియన్స్ ఉన్నా కూడా వారిని పైకి రాకుండా తొక్కేస్తున్నారని చెప్పింది. అటు తనకు ఇండస్ట్రీ కానీ.. ఇటు బంధువుల సపోర్ట్ కానీ లేదని గీతూ సింగ్ చెప్పుకొచ్చింది.
Read Also: NTR 30: శ్రీలీలకు గోల్డెన్ ఛాన్స్.. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాకు ఫిక్స్ ?
డబ్బు కావలిస్తేనే తన కుటుంబ సభ్యులకు తాను గుర్తొస్తానని చెప్పుకొచ్చింది. తన సొంత చెల్లి కూడా డబ్బు కోసం తనను వాడుకుందని గీతాసింగ్ తెలిపింది. నమ్మినవాళ్లే నట్టేట ముంచేశారని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర చిట్టీలు వేసి ఆమె మోసం చేయడంతో రూ.ఆరు కోట్లు నష్టపోయానని గీతాసింగ్ వెల్లడించింది. అవకాశాల్లేక.. చేసేందుకు పని లేక రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశానని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో తన స్నేహితురాలే కాపాడి పెద్ద దిక్కుగా ఉందని వెల్లడించింది.తన అన్న పిల్లల్నే దత్తతు తీసుకుని వారితో జీవిస్తున్నానని గీతాసింగ్ తెలిపింది.