టాలీవుడ్ లో నటుడిగా, రచయితగా తనికెళ్ళ భరణి సుపరిచితుడే. ఇక ఆయన శివుడిపై రాసే కవితలకు ఫ్యాన్స్ మాములుగా ఉండరు. అయితే చిత్ర పరిశ్రమలో ఉంటున్నామంటే ఎన్ని పురస్కారాలు ఉంటాయో.. అన్ని తిరస్కారాలు కూడా ఉంటాయి. ఎంతమంది మెచ్చేవాళ్ళు ఉంటారో అంతేముంది తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. తాజగా ఇక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తనను తిట్టడం కాదు.. చంపేస్తామని బెదిరించారని కూడా చెప్పుకొచ్చారు.
ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ఊహ హీరోయిన్ గా ఆమె సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అందులో ఊహకు బావగా తనికెళ్ళ భరణి నటించారు,. అందులో కొద్దిగా బ్యాడ్ విలనిజం చూపించిన ఆయన ఊహను అత్యాచారం చేసి పెళ్లి చేసుకుంటాడు. ఈ సినిమా విడుదలయ్యాకా ఆ పాత్రకు మంచి పేరు రావడం అటు ఉంచితే.. బయట తనను ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టడానికి ప్రయత్నించారని, ఇంకొంతమంది మహిళలు అయితే చంపేస్తామని బెదిరించారని చెప్పుకొచ్చారు. అది అంతా సినిమా అమ్మ .. నిజం కాదు అన్నా కూడా వారు ఆ ట్రాన్స్ లోనుంచి బయటికి వచ్చేహ్వరు కాదు. సినిమా నాటే అంత పిచ్చి జనాలకు అంటూ తెలిపారు.