పటాస్ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అనిల్ రావిపూడి అతి తక్కువ సమయంలో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా అవతరించాడు. ఆయన దర్శకుడిగా మారి 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈరోజు మీడియాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. పటాస్తో మొదలుపెట్టి ఇటీవల రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. 10 ఏళ్ల వ్యవధిలో ఎనిమిది సినిమాలు ఫ్లాప్ లేకుండా పూర్తి చేయడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే ఆయన ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. వారం రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కరెక్ట్ చేసి రీజినల్ సినిమాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఆయనని మోడ్రన్ ఈవీవీ అంటూ పోలుస్తున్న నేపథ్యంలో ఇదే ప్రశ్న ఎదురయింది.
ITRaids : సుకుమార్ ఇంటిపై ఐటీ సోదాలు
దానికి అనిల్ రావిపూడి సమాధానం ఇస్తూ తన జీవితంలో ఇది బెస్ట్ కాంప్లిమెంట్ అంటూ చెప్పవచ్చాడు.. కేవలం బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ మాత్రమే కాదు అది బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ కూడా అంటూ ఆయన కామెంట్ చేశాడు. ఈవీవీ లాంటి లెజెండరీ డైరెక్టర్ తో నన్ను పోల్చడం అది కూడా చిన్నప్పుడు నేను ఆయన సినిమాలను ఎంతో ఎంజాయ్ చేసేవాడిని. దాన్ని నేను జీవితంలోనే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ గా తీసుకుంటాను అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే తాను నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ లతో సినిమాలు చేశానని మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా పట్టాలెక్కబోతోందని అన్నారు. నాగార్జున గారితో కూడా 100% సినిమా చేస్తానని ఒకప్పుడు సినిమా పరిశ్రమకు ఫోర్ పిల్లర్స్ గా చెప్పుకొని సీనియర్ హీరోలతో చేసిన అతి తక్కువ మంది డైరెక్టర్లలో తాను కూడా ఒకడిగా నిలవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.